![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లాస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో అమరదీప్ చేసిన పనికి అందరూ షాకయ్యారు. అమరదీప్ కి రవితేజ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఐతే ఈ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే అమరదీప్ కి రవితేజ అంటే ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. హెయిర్ స్టైల్ కానీ టోటల్ ఆటిట్యూడ్ కానీ అంతా కూడా రవితేజనే ఫాలో అవుతూ ఉంటాడు. ఐతే అమరదీప్ కి డెబ్జానీ అంటే ఇష్టం ఈ షోలో ఈమెతో పరాచికాలు ఆడుతూ ఉంటాడు. ఆమె కూడా సరదాగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఈ న్యూ ప్రోమోలో అమరదీప్, డెబ్జానీ ఇద్దరూ కాళీ ఇడియట్ పోస్టర్ ని స్పూఫ్ చేస్తే వెనక నుంచి సాకేత్ కొమాండూరి "జింతాతా జితాజితా" సాంగ్ ని వాళ్ళ ఇద్దరి పేర్లతో రాసి పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇక అలా చూడలేని శ్రీముఖి వీపు మీద బాధేసింది..డెబ్జానీ ఐతే అమరదీప్ జుట్టు పట్టుకుని పీకేసింది. ఇక జడ్జ్ అనసూయ ఐతే దొంగ సచ్చినోడా అంటూ క్యూట్ గా తిట్టింది. "తేజు షర్ట్ తీయమంది..నాకు వాతలు పెట్టేసింది" అంటూ సాకేత్ పడేసరికి డెబ్జానీ ఫుల్ ఎంటర్టైన్ అయ్యింది. అమరదీప్ ఐతే బాగా నవ్వుకున్నాడు.
ఇంతలో కౌబాయ్ గెటప్ లో యాదమ్మరాజు నేను పెద్ద డైరెక్టర్ ని అంటూ వచ్చాడు. "మీరు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు" అని అడిగింది శ్రీముఖి. "350 సినిమాలు తీశాను" అని చెప్పాడు. "మరి మేము ఒక్కటి కూడా చూడలేదు మీ సినిమా" అని అడిగింది శ్రీముఖి. "నేను రిలీజ్ చేయలేదు" అన్నాడు. "ఎందుకు చేయలేదు" అని శ్రీముఖి అనేసరికి "నేను కష్టపడి సినిమా తీస్తే మీరు కూర్చుని చూస్తారా" అని కౌంటర్ వేసాడు.
![]() |
![]() |